భువనగిరి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జిల్లాలో సజావుగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగిన ఫస్టి యర్ ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షకు 7, 222 మంది విద్యార్థులకుగాను 6, 796 మంది హాజరయ్యా రు. 426 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ పరీక్షల కమిటీ కన్వీనర్ బుంగ సంజీవ తెలిపారు. జనరల్ విభాగంలో 5, 630 మందికిగాను 5, 374 మంది హాజరు కాగా. 256 మంది విద్యా ర్థులు గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1, 592 మందికి 1, 422 మంది హాజరయ్యారు. 170 మంది గైర్హాజరయ్యారు. మొత్తంగా 94. 10 హాజరు శాతం నమోదైనట్లు చెప్పారు.