మేషం: ఇంటా బయట శుభ ఫలితాలను పొందుతారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు ఇనుమడిస్తాయి. దైవానుగ్రహంతో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో భవిష్యత్తు ప్రణాళికను చేస్తారు. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో ఉత్తమ ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటుంది.
వృషభం: శారీరక మానసిక అనారోగ్యాలు ఉంటాయి. ఇతరుల మీద మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. అనుకొన్న సమయానికి అనుకున్న రీతిలో పనులు పూర్తికాక ఇబ్బందికి గురవుతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులు కోపానికి గురికావల్సి వస్తుంది. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి.
మిధునం: నూతన వస్తు,వాహన సౌకర్యం పొందుతారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది ఉద్యోగులకు అనుకూలత పెరుగుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.
కర్కాటకం: ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.
సింహం: ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపారమున ఆలోచనలో స్థిరత్వం లోపిస్తుంది. శరీర ఆరోగ్య సమస్యలు కొంత కలవరపెడతాయి. వృధా ఖర్చులు చేస్తారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.
కన్య: ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. పాత మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.
తుల: నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల మంచి జరుగుతుంది. కొన్ని వ్యవహారాలు ఆత్మవిశ్వాసంతో దైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. వృత్తిఉద్యోగాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి.
వృశ్చికం: ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. సౌకర్యాల కొరత లేకున్నా ఇతరుల వలన ఇబ్బందులు ఉంటాయి. కారణం లేకుండానే కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు మానసిక చింతను కలిగిస్తాయి.
ధనస్సు: దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులను సేకరించి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు అనుకూల సమయం.
మకరం: చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికం అవుతాయి. బంధువుల నుండి ఋణ వత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ఉద్యోగ విషయమై చెయ్యని పనికి నిందలు పడతారు. నిరుద్యోగ ప్రయత్నాలకు నిరాశ తప్పదు.
కుంభం: బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో అవాంతరాలు అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది. విలువైన వస్తువులు బహుమతులుగా లభిస్తాయి.
మీనం: ఇతరులతో వివాదాలు కలిగిన విజయం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆదరాభిమానాలకు పొందుతారు. వ్యాపారపరంగా ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు అమలుపరచి మంచి ఫలితాలను సాధిస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను జారవిడువకుండా చూసుకోవాలి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.