ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు వేసవి సెలవులు మంజూరు చేస్తూ ఆ సంస్థ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జూలై 3 తేదీ వరకు సెలవులు వర్తిస్తాయన్నారు. ఈ మధ్యలో ఆయా గురుకులా ల ప్రిన్సిపల్స్ ఏమైనా పనుల నిమిత్తం పిలిస్తే విధులకు హాజరు కావాలని స్పష్టం చేశారు. వేసవి సెలవుల్లోనూ ఒప్పంద ఉపాధ్యాయులకు ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తుందని వివరించారు.