అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి కొత్తకోటలో ఈనెల 30వ తేదీన జరగనున్న జాబ్ మేళా ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని వైయస్సార్ సిపి నాయకులు కులదీప్ రెడ్డి, అంజద్ ఖాన్, నౌషాద్ కోరారు. ప్రత్యేక వాహనం ద్వారా గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. జాబ్ మేళా కు వచ్చే వారికి వాహన సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.