ఏపీలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూలై 6 నుంచి 15 వరకు జరగనున్నాయి. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజుల చెల్లింపు ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఫీజు చెల్లింపు గడువు జూన్ 20 వరకు ఉంది. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ సమాచారంతో సంబంధం లేకుండా ఫెయిలైన విద్యార్థులు గడువులోగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లించాలని అధికారులు తెలిపారు.