మేషం: కుటుంబ సభ్యులతో కొన్ని కీలక విషయాలపై చర్చలు చేస్తారు ఊహించని శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆదాయం పెరుగుతుంది. నూతన వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు.
వృషభం: పట్టిన పనులు మధ్యలో విరమిస్తారు.సమాజంలో కొత్త మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. సంతాన పరమైన ఇబ్బందులు బాధిస్తాయి.
మిధునం: దీర్ఘకాలిక వివాదాలకు సంభందించి సన్నిహితుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. కుటుంబంలో గందరగోళ పరిస్థితులుంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో కొంత జాప్యం తప్పదు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి ఉద్యోగాలు కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది.
కర్కాటకం: అనుకున్న పనులు నూతనోత్సాహంతో పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. గృహమునకు దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
సింహం : చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ఊహించని ఆటంకాలు కలుగుతాయి.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి, ఉద్యోగాలు స్థిరత్వం ఉండవు.
కన్య: దీర్ఘకాలిక ఋణ సమస్యలు తీరి ఊరట పొందుతారు. కొన్ని వ్యవహారాలు ఆకస్మికంగా విజయం సాధిస్తారు. గృహమున బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు.వృత్తి ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.
తుల: బంధు మిత్రులతో కలహా సూచనలున్నవి నూతన రుణయత్నాలు చేస్తారు. దూరప్రయాణాలలో వాహన అవరోధాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. నూతన వ్యాపార ప్రారంభ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి, ఉద్యోగాలు అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.
వృశ్చికం: కీలక వ్యవహారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. కుటుంబమున దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆర్థికంగా స్థిరమైన ఆలోచనలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.
ధనస్సు: నిరుద్యోగుల శ్రమ ఫలించి నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.
మకరం: ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తికావు బంధువర్గంతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్య వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.
కుంభం: సన్నిహితులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరమైన చికాకులు పెరుగుతాయి. ఇంటా బయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి.సోదర వర్గం నుండి కీలక సమాచారం అందుతుంది. నిరుద్యోగ యత్నాలు ముందుకు సాగక నిరాశకలిగిస్తాయి. వ్యాపారాలలో స్వల్ప నష్ట సూచనలున్నవి.
మీనం: ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకుంటాయి.