ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుతం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు స్ట్రీమింగ్ రారాజుగా హల్‌చల్ చేసిన ఆ సంస్థకు ఇప్పుడు సబ్‌స్క్రైబర్లు తగ్గిపోతున్నారు. వరుసగా రెండవ క్వార్టర్‌లో కూడా పది లక్షల మంది సబ్‌స్క్రైబర్లను ఆ సంస్థ కోల్పోయింది. ఏప్రిల్ నుంచి జూలై మధ్య మిలియన్ సబ్‌స్క్రైబర్లు తగ్గిపోయారు.
చాలా వేగంగా నెట్‌ఫ్లిక్స్‌ను వీడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2011 తర్వాత తొలిసారి నెట్‌ఫ్లిక్స్‌లో సబ్‌స్క్రైబర్ల సంఖ్య క్రమంగా క్షీణిస్తోంది. దీంతో ఆ సంస్థ వందల సంఖ్యలో ఉద్యోగుల్ని కూడా తీసేస్తోంది. ప్రత్యర్థులు కూడా బలమైన కాంటెంట్ ఇవ్వడం.. మరో వైపు ప్యాకేజీల ధరల పెరగడంతో కస్టమర్లు నెట్‌ఫ్లిక్స్‌ను వీడుతున్నారు.