జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం కడప జిల్లా సిద్ధవటానికి పర్యటనకు వెళుతుండగా మార్గమధ్యంలో మలినేని పట్టణం వద్ద కాన్వాయ్ లో ప్రయాణిస్తున్న వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో పది మందికి గాయాలు అయ్యాయి. వారిని హుటాహుటిగా కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించినారు. చిన్నపాటి గాయాలు మాత్రమే తగిలాయని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. సిద్ధవటం సభ జరిగిన తర్వాత గాయాలు అయిన వారిని చూసేందుకు వారి పరిస్థితి తెలుసుకొనుటకు కడప రిమ్స్ కు వెళ్లిన పవన్ కళ్యాణ్ వారి స్థితిగతులను వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని వారికి మంచి వైద్యం అందించాలని రిమ్స్ వైద్యులను కోరారు.