జార్ఖండ్ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే నీరాయాదవ్కు పెను ప్రమాదం తప్పింది. కొడెర్మాలోని ఆమె ఇంటికి సమీపంలో తాజాగా బాంబు పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీనిపై ఎస్పీ కుమార్ గౌరవ్ స్పందించారు. బాంబు పేలుడు ఘటనతో ఎవరికీ ముప్పు వాటిల్లలేదని చెప్పారు. ఈ కేసులో ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, అతడికి మతిస్థిమితం లేదని పేర్కొన్నారు.