టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఆదివారం ఉద్రిక్తత ఏర్పడింది. పలాసకు వెళ్లడానికి అనుమతి లేదని లోకేష్‌ను పోలీసులు ఆపేశారు. దీంతో శ్రీకాకుళం కొత్తరోడ్డు జంక్షన్ వద్ద రోడ్డుపై లోకేష్ బైటాయించారు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేశారు. అనంతరం టీడీపీ నేతలందరినీ పోలీసులు అరెస్ట్ చేసి, స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.