మంగళగిరి: ఆత్మకూరుకు చెందిన చిట్టీల వ్యాపారి పుట్టా వెంకటేశ్వరరావు భార్య లక్ష్మి సోమవారం ఉదయం బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంకటేశ్వరరావు గతంలో గ్రామస్తుల వద్ద వడ్డీకి డబ్బులు తీసుకుని పరారవగా కోర్టు ద్వారా ఐపీ నోటీస్ పంపారు. దీంతో ఇటీవల గ్రామస్తులు ఆయన ఇంటిపై దాడి చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో మనస్థాపానికి గురై లక్ష్మి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.