నేత్ర పేదలకు ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేస్తూ వారికి కంటి చూపును కల్పిస్తున్న లయన్ కంటి ఆసుపత్రి సేవలు అభినందనీయమని రాయచోటి అర్బన్ సీఐ సుధాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం చెన్నముక్కపల్లెలోని కంటి ఆసుపత్రిలో నేత్ర వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించి రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దాతల సహాయ సహకారాలతో ప్రతి ఆదివారం కంటి వైద్యశిబిరాలను ఏర్పాటు చేస్తూ పేదలకు నేత్ర శస్త్ర చికి త్సలు చేయడం హర్షించ దగ్గ విషయమన్నారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ చెన్నూరు అన్వర్‌బాషా, ఎంపీటీసీ సభ్యుడు రామచంద్రారెడ్డి, శివప్రసాదొడ్డి, వైద్యులు పాల్గొన్నారు.