బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి కేసులో 13 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పాట్నా-గయా మార్గంలో గౌరీచక్‌లోని సోహ్గి గ్రామం వద్ద ఆదివారం సీఎం కాన్వాయ్‌పై దుండగులు రాళ్ల దాడి చేశారు. దీంతో సీఎం కాన్వాయ్‌లోని నాలుగు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆ కార్లలో సీఎం భద్రతా సిబ్బంది ఉన్నారు. వారికి స్వల్ప గాయాలయ్యాయి.