కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లా ముధోల్ ప్రాంతంలో నివసించే దేశీయ జాతి కుక్కలకు అత్యున్నత స్థాయి వ్యక్తులకు రక్షణ కల్పించే ప్రత్యేక భద్రతా దళం శిక్షణ ఇవ్వాలని భావిస్తోంది. అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకోగల వీటి శరీరతత్వం, ఎత్తు, దూరదృష్టి వంటి లక్షణాల నేపథ్యంలో తగిన తర్ఫీదునిస్తే దళానికి ఉపయుక్తంగా ఉంటుందని యోచిస్తోంది. సీఆర్ఐసీ నుంచి ఇప్పటికే 2 కూనలను పరిశీలన నిమిత్తం ఎస్పీజీ తీసుకెళ్లింది.