గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వంశీ గనుల అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారంటూ దాఖలైన ఓ పిటిషన్ పై విచారణకు హైకోర్టు సిద్ధమైంది. ఈ మేరకు సోమవారం హైకోర్టు నోటీసులు పంపింది. దీనిపై తదుపరి విచారణను 8 వారాలు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది. వంశీతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గనుల శాఖ అధికారులకు నోటీసులు ఇచ్చింది.