కౌతాళం: ఉరుకుంద శ్రీ నరసింహ ఈరన్నస్వామి శ్రావణ మాస ఉత్సవాల్లో నాల్గవ సోమవారం పల్లకి మహోత్సవంలో భాగంగా ఆలయ అర్చకులు ఈవో వాణి ఆధ్వర్యంలో కందుకూరు సమీపంలో తుంగభద్రమ్మలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకులు స్వామివారి పల్లకి మోస్తూ పాదయాత్రతో తుంగభద్ర నదీకి వెళ్లారు. స్వామివారి ఉత్సవ మూర్తిని తుంగభద్రమ్మలో జలాభిషేకం గావించి తిరిగి పల్లకితో సాయంత్రానికి స్వామివారి సన్నిధి చేరుకుంటారు.