తమిళనాడు మాజీ సీఎం జయలలిత డెత్ మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఆమె తీసుకున్న కొన్ని రకాల ఆహార పదార్థాల వల్లే ఆరోగ్యం మరింత విషమించిందని, అపోలో ఆస్పత్రి తప్పేం లేదని ఎయిమ్స్ వైద్యులు స్పష్టం చేశారు. ఈ మేరకు జయలలిత మృతిపై కమిషన్కు ఎయిమ్స్ వైద్య బృందం 3 పేజీల నివేదికను సమర్పించారు. అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరక ముందే జయలలితకు బీపీ, షుగర్, థైరాయిడ్ అధిక స్థాయిలో ఉన్నాయని తెలిపారు.