ఏపీలోని ఆరు జిల్లాల్లో భూ రీసర్వే చేసేందుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సర్వే చేసేందుకు 2,225 ప్రత్యేక బృందాలను సర్కార్ ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక బృందాలకు జగనన్న భూ రక్ష సర్వే ఫోర్సెస్గా పేరు పెట్టారు. మొదటగా ఈ సర్వే అల్లూరి సీతారామరాజు, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపట్టనున్నారు.