కర్ణాటకలోని తుమకూర్ జిల్లాకు చెందిన సమీయుల్లాకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య కొద్దిరోజుల క్రితం ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ భర్తకు అప్పుడప్పుడూ వీడియో కాల్స్ చేస్తుండేది. దీంతో మనస్తాపం చెందిన సమీయుల్లా.. పిల్లలకు విషమిచ్చి అనంతరం తానూ తాగాడు. ఈ ఘటనలో సమీయుల్లా మృతి చెందగా.. పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.