మొన్నటి వరకూ లాభాలతో దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలను చవిచూశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 872 పాయింట్లు, నిఫ్టీ 267 పాయింట్లు నష్టాలతో కొనసాగుతోంది. అయితే ఐటీసీ, నెస్లే ఇండియా, కంపెనీల షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్, ఏసియన్ పెయింట్స్, విప్రో, సన్ ఫార్మా సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.