జింబాబ్వేతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఆటగాడు శుబ్ మన్ గిల్ 130 రన్స్ తో చెలరేగాడు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 289 రన్స్ చేసింది. టీమిండియాలో ధావన్ 40, రాహుల్ 30, ఇషాన్ 50 రన్స్ చేశారు. జింబాబ్వే బౌలర్ బ్రాడ్ ఎవాన్స్ 5 వికెట్లు పడగొట్టాడు. ఇక సెంచరీతో అదరగొట్టిన గిల్ కు వన్డేల్లో ఇదే ఫస్ట్ సెంచరీ. ఈ మ్యాచ్ లో గెలవాలంటే జింబాబ్వే 290 రన్స్ చేయాలి.