డిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పులకు గానూ ఆయనకు భారతరత్న ఇవ్వాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీని ద్వారా దేశంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చే బాధ్యతను మనీష్ కు అప్పగించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా సోమవారం గుజరాత్ లో మీడియాతో మాట్లాడుతూ మనీష్ పై సీబీఐ దాడులు చేయించడం సరికాదని మండిపడ్డారు.