ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక దేశానికి భారత్ భారీ సాయం అందిస్తోంది. గతంలో మెడిసిన్, నిత్యావసరాలను అందించింది. తాజాగా శ్రీలంకకు సుమారు 21 వేల టన్నుల ఎరువుల్ని భారత్ ఎగుమతి చేసింది. కొలంబోలో ఉన్న భారత ఎంబసీ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. రెండు దేశాల మధ్య స్నేహం, సహకారం కొనసాగుతోందని, గత నెలలో కూడా శ్రీలంకకు 44 వేల టన్నుల ఫెర్టిలైజర్లను అందించినట్లు తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa