పల్నాడు జిల్లా స్పందనలో ఎస్పీ కార్యాలయం ఎదుట మహిళ తనకు న్యాయం జరగటం లేదంటూ స్లీపింగ్ పిల్స్ మింగింది. భార్యాభర్తల వివాదంలో నమోదు అయిన కేసులో 2 టౌన్ సీఐ తనకి న్యాయం చేయటం లేదని సోమవారం మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. బాధిత మహిళను పోలీసులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.