రేపల్లె: నగరంలోని భారతి అనే మహిళ ఇంట్లోని బాత్రూంలో మోర్ల వెంకటేశ్వరరావు(47) అనే వ్యక్తి మృతదేహం అనుమానస్పద స్థితిలో లభ్యమైంది. మృతుడి కుమార్తె నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ ఘటనపై రేపల్లె గ్రామీణ సీఐ శివశంకర్ మాట్లాడుతూ తమ తండ్రి మృతుడు వెంకటేశ్వరరావును భారతి, భారతి తల్లి కొట్టి చంపి బాత్రూంలో పడవేసినట్లు మృతుడు కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa