చెరుకుపల్లి కస్తూరి వారి పేటలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. నాగుల కోటేశ్వరమ్మ కు చెందిన ఇల్లు సోమవారం ఉదయం షార్ట్ సర్క్యూట్ తో దగ్ధం అవ్వగా ఇంట్లోని వస్తువులన్నీ అగ్నికి ఆహుతి అయ్యాయి. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. సుమారు 50 వేల రూపాయలు నష్టం వాటిల్లినట్లు బాధితురాలు కోటేశ్వరమ్మ తెలిపింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.