బీజేపీ, వైసీపీ పార్టీలు రెండూ కసాయి పార్టీలు అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. వేంపల్లి పట్టణంలో ఆయన మాట్లాడుతూ. రాష్ట్రానికి పట్టిన రాహు కేతువులు బిజెపి, వైకాపా పార్టీలన్నారు. ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టిందని , రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చింది. కడప జిల్లా స్టీల్ ప్లాంట్ కు స్వస్తి పలికింది. దుగరాజపట్నం ఓడరేవు కు మంగళం పాడింది. పోలవరం ప్రాజెక్టు ను ప్రశ్నార్థకం చేసింది. విశాఖ, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ వూసేలేదు. విశాఖ రైల్వే జోన్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉంది.
ఐఐటీ, ఎన్ఐటీ లాంటి 13 కేంద్రీయ సంస్థల ఏర్పాటు నత్తనడకనసాగుతోంది. 9, 10 షెడ్యూల్ లలోని వందలాది సంస్థలు హైదరాబాద్ నుండి రాష్ట్రానికి తరలి రాలేదని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టిందని, ఆంధ్రా బ్యాంక్ ను యూనియన్ బ్యాంక్ లో కలిపేసింది. మన్నవరం ప్రాజెక్టు ను మూసేసింది. చివరికి పోలీసు సిబ్బందికే వైకాపా గుండాల చేతిలో రక్షణ లేదు, రాష్ట్రంలో లాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియా రాజ్యమేలుతోందని, బిజెపి, వైకాపా లను రాష్ట్ర పొలిమేరల తరిమి కొడితే తప్ప రాష్ట్రానికి రక్షణ లేదన్నారు.