‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా సోమవారం చెట్నెహళ్లి గ్రామంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, మండల కన్వీనర్ భీమిరెడ్డి, మండల ఇన్చార్జ్ విశ్వనాథ్రెడ్డితో కలిసి పర్యటించారు. గ్రామంలో 419 ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పథకాలు గ్రామస్తులకు వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. అవ్వాతాతలు, అక్కా చెల్లెమ్మలు, విద్యార్థులు సైతం జగనన్నను ఎంతగానో ప్రేమిస్తున్నారని పేర్కొన్నారు. అమ్మఒడి, వైయస్సార్ పింఛన్ ఆసరా, రైతు భరోసా తదితర పథకాలకు ప్రజలు ఆకర్షితులయ్యారని గుర్తు చేశారు.
నియోజకవర్గం ప్రగతి కోసం సర్వదా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రామస్తుల కోరిక మేరకు ఎస్సీ కాలనీలో డ్రెయినేజీ సమస్యకు పరిష్కారం చూపుతానని చెప్పారు. అలాగే గ్రామంలోని భీరలింగేశ్వరస్వామి ఆలయ వెనుక భాగంలో మట్టి రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచు అంజినయ్య, ఎంఈవో మొయినుద్దీన్, ఏపీఎం జయశ్రీ, ఏపీవో తిమ్మారెడ్డి, ఎస్ఐ చంద్ర, ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి భార్గవి, సర్వేయర్ హరికృష్ణ, ఏఈవో నరసింహుడు, నాయకులు వెంకటేశ్ , వీరనాగుడు పాల్గొన్నారు.