పూతలపట్టు: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామికి ఆరు నెలల తరువాత ఆదివారం రాత్రి గ్రామోత్సవం జరిగింది. ఆలయ పున:నిర్మాణం పనులను మార్చి 27వ తేదీ ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రధాన ఆలయం తోపాటు అనుబంధ ఆలయాల్లో ప్రాకారోత్సవాలను నిలిపివేశారు. ఆదివారం ఉదయం మహా కుంభాభిషేకం, రాత్రి కళ్యాణోత్సవం ఘనంగా జరిపారు. సిద్ధి బుద్ధి సమేత వరసిద్ది గ్రామోత్సవాన్ని భాజాభజంత్రీలతో గ్రామంలో ఘనంగా నిర్వహించారు.