దేశంలో కరోనా కేసులు సంఖ్య క్రమేపీ తగ్గుతూ వస్తోంది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 8,586 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కరోనా బారిన పడిన వారిలో 9,680 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 96,506కు చేరుకుంది. కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.