నాలుగు నెలల చీకటి తర్వాత అంటార్కిటికాలో తొలిసారి సూర్యుడు తొంగిచూశాడు. అంటార్కిటికా ఖండంలో శీతాకాలం ముగియడంతో 4 నెలల సుదీర్ఘ అంధకారం తర్వాత మంచు కొండల మధ్యలో నుంచి సూర్యుడు తొంగిచూశాడు. అంటార్కిటికాలో సాధారణంగా రెండే కాలాలుంటాయి. వేసవికాలం, చలికాలం. మే నెలలో చలికాలం ప్రారంభంకాగానే ఉష్ణోగ్రతలు మైనస్ 70-80గా నమోదవుతాయి. ఆగస్టు వరకు 4 నెలలు చీకట్లు కమ్ముకుంటాయి. ఆగస్టులో మళ్లీ సూర్యుడు కనిపిస్తాడు.