ప్రస్తుతం సెల్ఫీలు, వీడియోల కోసం ఎంతటి భయంకరమైన సహాసాలకైనా జనాలు వెనకాడటం లేదు. వినూత్న ప్రయత్నాలు చేస్తూ తమ ధైర్య సాహాసాలను బయటపెడుతున్నారు. తాజాగా ఇలాంటి ప్రయత్నమే ఓ అమ్మాయి చేసింది. కరెంట్ స్తంభాన్ని పట్టుకొని దానిపై ఏరోబిక్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అది చూసిన నెటిజన్లు కొందరు ప్రశంశిస్తే.. మరి కొందరు మాత్రం ఆమె రిస్క్ చేస్తోందని విమర్శిస్తున్నారు.