నెల్లూరు జిల్లా, సర్వేపల్లి: పీఎం కిసాన్ యోజన పథకంలో ఈకేవైసీ నమోదుకు ఈ నెలాఖరుతో గడువు ముగుస్తుందని మండల వ్యవసాయాధికారి జహీర్ మంగళవారం తెలిపారు. మనుబోలు మండలంలో ఈ పథకం కింద 6, 247 మంది రైతులు లబ్ధి పొందుతున్నారని, వారిలో 2, 647 మంది మాత్రమే ఈకేవైసీ చేయించారని తెలిపారు. ఇంకా 3, 600మంది రైతులు చేయించాల్సి ఉందన్నారు. నెలాఖరులోగా ఈకేవైసీ నమోదు చేయకపోతే పథకం లబ్ది కోల్పోతారని ఆయన తెలిపారు.