ప్రముఖ కార్ల తయారీ కంపెనీ 'ఆడి' మంగళవారం కీలక ప్రకటన చేసింది. తమ కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. మోడల్ ను బట్టి 2.4 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. పెరిగిన ధరలు వచ్చే నెల 20వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ముడి సరకుల ధరలు, సరఫరా ఖర్చులు పెరగడంతో ధరలను పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఆడి ఇండియా భారత్ లో ఇటీవలే క్యూ3 మోడల్ కు బుకింగ్స్ ను ప్రారంభించింది.