స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఎస్పీ విష్ణువర్ధన్ రాజు పూలమాలలు వేసి ఘనoగా నివాళులు సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మద్రాసులో సైమన్ కమీషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకీ కెదురుగా దైర్యంగా ఛాతీ చూపించి ఆంధ్ర కేసరి అని పేరు పొందినారు.
నిరుపేద రైతు కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయిన ఆయన జీవితం నేటి యువతకు ఎంతో ఆదర్శం అన్నారు. భారత దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి చేపట్టిన అనేక ఉద్యమాలలో పాల్గొని దేశం పట్ల తన భక్తిని చాటిన గొప్ప సమరయోధుడు మన ప్రకాశం పంతులు అని కొనియాడారు. ఆ మహనీయుని పోరాట పటిమను, కార్యదక్షితను, ప్రజా సేవ చేయాలనే ఆయన సంకల్పాన్ని నెమరు వేసుకుంటూ మనం ముందుకు వెళ్లాలి అన్నారు.