వైఎస్ఆర్ కడప జిల్లా: వల్లూరు తహసిల్దార్ కార్యాలయంలో గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న మహిళా ఉద్యోగి పై అదే కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న దక్షిణామూర్తి చేయి చేసుకున్నారు. సోమవారం ఉదయం తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ ఎదుట సంఘటన చోటు చేసుకున్నది. తహసిల్దార్ ఓ ఫైల్ కు సంబంధించి గ్రామ రెవెన్యూ అధికారికి ఎండార్స్మెంట్ చేయగా ఎందుకు గ్రామ రెవెన్యూ అధికారికి ఇస్తున్నారు వారికి చదువు రాదు ఏమి రాదని రెవెన్యూ ఇన్స్పెక్టర్ అన్నారు. దీంతో ఆ మహిళా ఉద్యోగి ఎందుకు సార్ అలా అంటున్నారు మీరు అని ప్రశ్నించినందుకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ కు కోపం వచ్చి మహిళా ఉద్యోగి చెంపపై చెల్లుమని చేయి చేసుకున్నారు.
దీంతో గ్రామ రెవెన్యూ అధికారులు మంగళవారం వల్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమే లోకల్ యాప్ ప్రతినిధి తహసిల్దార్ సూర్య నారాయణ రెడ్డిని వివరణ కోరగా జరిగిన విషయాన్ని ఉన్నత స్థాయి అధికారులకు నివేదించినట్లు తెలిపారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ దక్షిణామూర్తిని వివరణ కోరగా నేను చేయి చేసుకోలేదని మాట్లాడుతున్న సమయంలో మహిళా ఉద్యోగి నన్ను తోసిందని ఆ సమయంలో కేవలం నేను మహిళా ఉద్యోగి ని నెట్టాను అని పేర్కొన్నారు.