ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళనే కాకుండా పలు రాష్ట్రాలు, నగరాల పేర్లలో మార్పులు

national |  Suryaa Desk  | Published : Wed, Feb 25, 2026, 02:46 PM

దేవుడి సొంత భూమిగా పిలిచే కేరళ రాష్ట్రం పేరు ఇకపై 'కేరళం'గా మారనుంది. ఈ ప్రతిపాదనలకు కేంద్ర క్యాబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నుంచి భాషా గుర్తింపు, సాంస్కృతిక వారసత్వం, చరిత్రను ప్రతిబింబించేలా పలు రాష్ట్రాలు, నగరాల పేర్లలో మార్పులు జరిగాయి. తూర్పు పంజాబ్ - పంజాబ్, యునైటెడ్ ప్రావిన్సెస్ - ఉత్తర ప్రదేశ్, మద్రాస్ రాష్ట్రం - తమిళనాడు, ఒరిస్సా - ఒడిశా వంటి రాష్ట్రాల పేర్లు మారాయి. అలాగే, గుంటూరు, ఏలూరు, కర్నూలు, కాకినాడ, బాంబే - ముంబయి, మద్రాస్ - చెన్నై వంటి నగరాల పేర్లు కూడా మారాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa