ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉందని కేసు నమోదు చేసిన కొద్ది రోజుల్లోనే మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. ఈ మేరకు మంగళవారం ఈడీ అధికారులు సిసోడియాపై మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు. గత వారం ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో తమకు అనుకూలంగా రూల్స్ మార్చుకున్న సిసోడియా సహా 14 మందిపై సిబిఐ కేసు నమోదు చేసి సిసోడియాతో పాటు మరికొందరు పెద్దఎత్తున అక్రమార్జనకు పాల్పడిన సంగతి తెలిసిందే.