సెప్టెంబరు 22న వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం నిర్వహిస్తామని.. ఆగస్టు 25న నిధులు విడుదల చేస్తామని సీఎం జగన్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వృద్ధిరేటులో ఏపీ అగ్రస్థానంలో నిలవడం, దేశ వృద్ధిరేటు కంటే ఎక్కువగా ఉండడం సంతోషకరమన్నారు. 15 వేల సచివాలయాలకు రూ.3000 కోట్లు ప్రాధాన్యతా పనులకు వెచ్చించబోతున్నామన్నారు.