రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నాయి బ్రాహ్మణ సంఘం నేతలు తీవ్రంగా మండిపడ్డారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇచ్చిన జీవోను అమలు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇచ్చిన జీవోను అమలు చేయాలంటూ నాయి బ్రాహ్మణ సంఘం నేతలు ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను నిలదీశారు. మంత్రి కారుకు అడ్డుగా పడుకుని ముందుకు కదలనివ్వలేదు. దేవాలయాల్లో పనిచేస్తున్న క్షురకులకు మినిమం స్కేల్ ఇస్తూ సిద్ధం చేసిన జీవోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రూ.10 వేల ఫిక్స్ డ్ వేతనం తమకు వద్దంటూ దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు బైఠాయించారు. దీంతో మంత్రికి ఇబ్బందికర వాతావరణం ఎదురైంది. నాయి బ్రాహ్మణ సంఘం నేతలకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు.