పశ్చిమ బెంగాల్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు 11 రోజుల సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది దుర్గాదేవి నవరాత్రులను ఘనంగా నిర్వహించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అలాగే నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గాదేవి మండపాల నిర్వాహకులకు రూ.60 వేలు నిధులు ప్రకటించారు.