పులివెందుల లో ముగ్గురు యువకుల గల్లంతు. ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన ఇద్దరు పొట్ల దుర్తి గ్రామానికి చెందిన ఒకరు మంగళవారం పుట్టపర్తి జిల్లా కదిరికి వెళ్లి ఆటోలో టైల్స్ తీసుకొని తిరిగి ప్రొద్దుటూరుకు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో నామల గుండు వద్ద ఉన్న నీటి కొలనులో ఈత కొట్టేందుకు దిగారు. అందులో ఉన్న సుడిగుండంలో చిక్కుకొని గోపాల్ దాస్ నాని, తెల్ల పాయల సంజీవ్ కుమార్ , తెల్లపాయల బాల శేఖర్ లు మునిగిపోయారు. ఆ దారిలో వెళ్తున్న ప్రయాణికుడు గమనించి దగ్గరలో ఉన్న చెక్పోస్ట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఫైర్ సిబ్బంది గల్లంతయిన వారికోసం గాలింపు చేపట్టారు. బుధవారం ఉదయం చనిపోయిన ముగ్గురిని బయటకు తీసుకొచ్చారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.