విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ అఖిల భారత విద్యార్థిసంఘం ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన విద్యాసంస్థల బంద్ ఎర్రగుంట్లలో సంపూర్ణంగా ముగిసింది. స్థానిక ఏఐఎస్ఎఫ్ శ్రేణులు ఇక్కడి విద్యాసంస్థలను మూయించి వేశారు. ప్రైవేటు విద్యాసంస్థలు స్వచ్చందంగానే తమ పాఠశాలలకు సెలవులు ప్రకటించుకున్నాయి. నూతన జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేయాలంటూ ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. అలాగే 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తున్న ప్రక్రియను ఆపాలంటూ వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎం. నారాయణ, మండల కార్యదర్శి లీలాకృష్ణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శరత్ కుమార్, మహిళా నాయకురాలు పూజిత దివ్యతో పాటు దస్తగిరి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.