టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించారు. బ్యాటింగ్ వైఫల్యం, భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోవడమే ఓటమికి కారణమని ఆయన పేర్కొన్నారు. బౌలర్లు అద్భుతంగా రాణించారని ప్రశంసించారు. 'గెలుపోటములు ఆటలో భాగమే, తప్పుల నుంచి నేర్చుకుని బలంగా తిరిగి వస్తాం' అని సూర్యకుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఓటమితో భారత్ సెమీస్ అవకాశాలు సన్నగిల్లాయి.సూపర్-8 గ్రూప్-1లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 76 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో చిత్తయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సఫారీలు 7 వికెట్ల నష్టానికి 187 రన్స్ చేసింది. ఛేదనలో భారత్ 18.5 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది.మ్యాచ్ ప్రారంభంలోనే దక్షిణాఫ్రికాను 21/3కి పరిమితం చేయడంతో మేము మంచి ఆరంభం చేశాం. అయితే 7 నుంచి 15 ఓవర్ల మధ్య ప్రత్యర్థి బ్యాటర్లు బాగా ఆడారు. అయినప్పటికీ చివర్లో మళ్లీ మేము మ్యాచ్‌లోకి తిరిగి వచ్చాము. బౌలింగ్ పరంగా మంచి ప్రదర్శన చేశాం. బ్యాటింగ్‌లో మెరుగ్గా ఆడాల్సింది. ఛేజింగ్ చేసే సమయంలో పవర్‌ప్లే కీలకం. 180–185 పరుగుల లక్ష్యాన్ని చేదించేటపుడు పవర్‌ప్లేలో మ్యాచ్ గెలవలేమని, కానీ ఓడిపోవచ్చని గ్రహించాలి. ప్రారంభంలో ఎక్కువ వికెట్లు కోల్పోవడం వల్ల చిన్న చిన్న భాగస్వామ్యాలు నిర్మించలేకపోయాము. ఈ ఓటమి మమ్మల్ని నిరాశ పరిచింది. గెలుపోటములు ఆటలో భాగమే. ఈ తప్పుల నుంచి నేర్చుకుని మరింత బలంగా తిరిగి వస్తాం' అని ధీమా వ్యక్తం చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa