ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేలైన జీర్ణక్రియకు సహజసిద్ధమైన చిట్కాలు!

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Feb 23, 2026, 01:51 PM

జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి, విషాన్ని బయటకు పంపడానికి, ఆమ్లతను తగ్గించడానికి గోరువెచ్చని నీటిలో నిమ్మరసం తాగడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అల్లం టీ తాగడం వల్ల జీర్ణక్రియ వేగవంతమవుతుంది. గ్యాస్ సమస్యకు వాము, నల్ల ఉప్పు కలిపి గోరువెచ్చని నీటితో తీసుకోవడం, జీలకర్ర నీళ్లు తాగడం, ఇంగువ నీళ్లు తాగడం లేదా నాభి చుట్టూ ఇంగువ పేస్ట్ అప్లై చేయడం వంటి సహజసిద్ధమైన చిట్కాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.ముందుగా ఓ గ్లాసులో పెరుగు, జీలకర్ర పొడి, ఉప్పు, అల్లం పొడి వేసి బాగా కలపాలి. పదార్థాలన్నీ కలిశాక గోరువెచ్చని నీటిని యాడ్ చేయాలి. అంతే మీ డ్రింక్ సిద్ధంగా ఉన్నట్టే. దీనిని మనం భోజనం చేశాక 15 నిమిషాలకి తాగాలి. జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉంటే రెగ్యులర్‌గా తాగి చూడండి. మీకే తేడా తెలుస్తుంది.ఇప్పుడు చెప్పిన డ్రింక్ తాగడం వల్ల జీర్ణక్రియకి అవసరమైన అగ్ని రగులుతుంది. అమాని అంటే బాడీలో టాక్సిన్స్ పేరుకుపోకుండా ఉంటాయి. ఉబ్బరం, బరువు, గ్యాస్ తగ్గుతుంది. భోజనం తర్వాత అనిపించే హెవీనెస్ ఉండదు. జీవక్రియ చక్కబడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa