రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగ, ఉపా ధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25వ తేదీన కడప నగరంలో తలపెట్టిన ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పశ్చిమ రాయలసీమ పట్టుభద్రుల శాసన మండల టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడేళ్ల వైసీపీ పాలనలోఉద్యోగ, ఉపాధిలేక నిరుద్యోగ యువత ఆందోళనకు గురవుతోం దన్నారు. రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలతో నిరుద్యోగ యువత అనేక రకాలుగా ఇబ్బంది పడుతోందన్నారు. విద్యావ్యవస్థ వినాశనానికి కారణమవు తున్న 117 జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యాసంస్త ల్లో పనిచేసే ఉపాధ్యాయుల అర్హత పరీక్షలను రద్దు చేయాలన్నారు. ప్రస్తుత సమయంలో యువత శక్తి ఏమిటో నిరూపించుకోవాల్సిన అవశ్యకత ఉందన్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత, ఉద్యోగ, ఉపాధ్యాయ సంక్షేమం కోసం తలపెట్టిన ఛలో కలెక్టరేట్ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు, యువత పెద్దఎత్తున తరలిరావాలని ఆయన విజ్ఞప్తిచేశారు.