వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసే ప్రతి ఒక్క వినాయకుడి విగ్రహానికి పోలీసుల అనుమతి తప్పనిసరిగా ఉండాలని డీఎస్పీ వెంకటశివా రెడ్డి అన్నారు. అనుమతి కోసం సంబంధిత పోలీసు స్టేషన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మంగళవారం కడపలో డీఎస్పీ విలేకరులతో మాట్లాడారు. పంచాయతీ, అగ్నిమాపక, విద్యుత్తు శాఖల నుంచి ముందుగా అనుమతి పొందాలన్నారు. పండగ ప్రారంభం నుంచి ముగిసే వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా ఉత్సవ కమిటీ నిర్వాహకులే చూసుకోవాలన్నారు. మండపం వద్ద రాత్రి వేళల్లో కమిటీ నిర్వాహకులు ఉండాలని, ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి పండగ జరుపుకోవాలని డీఎస్పీ సూచించారు.