వేరుశనగ ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేరుశనగ ఒబేసిటీ సమస్యని తగ్గిస్తుంది. చర్మానికి, జుట్టుకి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. బరువు తగ్గడానికి కూడా వేరుశనగ బాగా ఉపయోగపడుతుంది. వేరుశనగ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
- వేరుశనగ ఒబేసిటీ సమస్యను తగ్గిస్తుంది.
- రోజుకి ఒకటి లేదా రెండు స్పూన్ లు పల్లీలు తినడం వల్ల బరువు తగ్గవచ్చు.
- మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో వేరుశనగ తీసుకుంటే మంచిది. వేరుశనగ ఫెర్టిలిటీని పెంచుతుంది. అలాగే కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది. పల్లీలను నీళ్ళల్లో నానబెట్టుకుని గర్భిణిలు తింటే మంచిది.
- పల్లీల నూనె చర్మానికి అప్లై చేసుకోవడం వల్ల ముడతలు తగ్గుతాయి. అలాగే చర్మం ఎంతో బాగుంటుంది. పల్లీల నూనెలో కొద్దిగా నిమ్మ రసం వేసుకొని ముఖానికి అప్లై చేసుకుని 10 నిమిషాల పాటు ఉంచి ఆ తరువాత ముఖాన్ని కడిగేసుకుంటే మీ ముఖం అందంగా మారుతుంది.
- పల్లీల నూనె జుట్టుకి ఎంతో మేలు చేస్తుంది. చుండ్రుని కూడా ఇది తగ్గిస్తుంది. కొద్దిగా నీళ్లని నూనెలో వేసుకుని కలుపుకుని వారానికి మూడు సార్లు తలకు పట్టిస్తే జుట్టుకి మంచిది.