మన వంటింట్లో లభించే వాము కేవలం రుచి కోసమే కాకుండా, ఆయుర్వేదంలో శక్తివంతమైన ఔషధంగానూ ఉపయోగిస్తారు. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలకు వాము గింజలను వేయించి లేదా నీటిలో మరిగించి తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది. యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించి, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వేసవిలో డీహైడ్రేషన్‌ను అరికట్టి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa