కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి 62 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై నారాయణ తెలిపారు. కడప ఏడురోడ్ల కూడలి సమీ పంలోని ఓ లాడ్జిలో పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులు మద్యం సీసాలను కొనుగోలు చేసి లాడ్జిలో నిల్వ ఉంచారన్నారు. లాడ్జికి వచ్చిన వారు ఎవరైనా మద్యం కావాలని అడిగితే ఎక్కువ మొత్తానికి విక్రయిస్తున్నారన్నారు. సమాచారం రావడంతో దాడులు చేసి వారి నుంచి 62 మద్యం సీసాలను స్వాధీనపరుచుకు న్నట్లు చెప్పారు.